A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
Share |
September 19 2020, 5:12 am

ఎపి విద్యుత్‌, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొద్ది రోజులుగా ఆయన స్వల్పంగా జ్వరంతో బాదపడుతున్నారు. ఆ మీదట ఆయన హైదరాబాద్ లో పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్ గా ఫలితం వచ్చిందని సమాచారం. దాంతో ఆయన హ:దరాబాద్ లోనే అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కధనం. ముందుగా ఆయన కు నెగెటివ్‌ రాగా,తదుపరి ఇంకో పరీక్షలో పాజిటివ్ వచ్చింది. కరోనా బారిన పడిన చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటుండగా, ఆయన కుమారుడు కరణం వెంకటేశ్‌కు కూడా పాజిటివ్‌ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు ఆయన భార్యకు కూడా వైరస్‌ ఉన్నట్లు తేలడంతో ఒంగోలులో చికిత్స పొందుతున్నారు.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info