A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
Share |
September 22 2020, 1:36 pm

రాష్ట్ర వ్యాప్తంగా 4 వ విడత ఉచిత చేప పిల్లల
పంపిణీ కార్యక్రమం ఈ నెల 6 వ తేదీ నుండి ప్రారంభం
కానున్నది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం
లోని పాలెం గ్రామంలోని పెంటాని చెరువులో
పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,
సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్
యాదవ్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి
నిరంజన్ రెడ్డి, స్థానిక mla శ్రీ మర్రి జనార్ధన్
రెడ్డి లతో కలిసి చేప పిల్లలను విడుదల చేసి
కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు. మొదటగా
5 వ తేదీన చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని
ప్రారంభించడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. కానీ 5
వ తేదీన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఉన్న కారణంగా
6 వ తేదీన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది.
అదేరోజు మహబూబ్ నగర్ జిల్లా లోని భూత్పూర్ మండలం
మడిగట్ల గ్రామంలోని మడికాని చెరువు, కోడూర్
గ్రామంలోని మైసమ్మ చెరువులో జిల్లాకు చెందిన
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర
mla శ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి తో కలిసి చేప
పిల్లలను విడుదల చేస్తారు. అనంతరం రంగారెడ్డి జిల్లా
ఫరూఖ్ నగర్ మండలం కమ్మదనం గ్రామంలోని
వెంకాయకుంట లో మంత్రి శ్రీ సబితా ఇంద్రారెడ్డి,
స్థానిక mla శ్రీ అంజయ్య యాదవ్ లతో కలిసి చేప
పిల్లలను విడుదల చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 24
వేల రిజర్వాయర్ లు, చెరువులలో 50 కోట్ల రూపాయల
ఖర్చుతో 81 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని
లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 10

కోట్ల రూపాయల ఖర్చుతో 5 కోట్ల రొయ్య పిల్లలను
విడుదల చేయడం జరుగుతుంది. చేప పిల్లల పంపిణీ
కార్యక్రమాలలో పాల్గొనాలని కోరుతూ ఇప్పటికే
మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలోని
మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన
మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ లకు
వ్యక్తిగతంగా లేఖలు కూడా పంపారు. చేప పిల్లల విడుదల
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య
సహకార సొసైటీ సభ్యులు పాల్గొనేలా అధికారులు
చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నేపద్యంలో చేప
పిల్లల విడుదల సమయంలో 25 మందికి మించి లేకుండా
జాగ్రత్తలు తీసుకోవాలని, శానిటైజర్ లు, మాస్క్ లు
అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత
అధికారులను ఆదేశించడం జరిగింది.

tags : talasani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info