A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
Share |
September 22 2020, 12:15 pm

అమరావతి విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండి పడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజలు పరిపాలన వికేంద్రీకరణ కోరుకుంటుంటే.. చంద్రబాబు మాత్రం తన ప్రయోజనాలకోసం అమరావతిని కోరుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేయటం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో తమ పార్టీ నుంచి లాక్కొన్న ఎమ్మెల్యేలతో ఆనాడు ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. చేయించలేదన్నారు. కాలక్షేపం కోసం, స్వప్రయోజనాల కోసం పాకులాడే చంద్రబాబు గురించి మాట్లాడటం అంటే సమయం వృథా చేసుకోవడమేనని వ్యాఖ్యానించారు.

tags : chevireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info