A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
Share |
September 22 2020, 1:39 pm

అమరావతిలో తన బినామీలు కొనుగోలు చేసిన ఆస్తులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాకులాడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఆస్తులపై తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని పునరుద్ఘాటించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేయడం హాస్యాస్పదమని, దమ్ముంటే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్‌ విసిరారు.

tags : midhunreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info