A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
Share |
September 22 2020, 1:13 pm

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వెన్నుపోటుదారుడు అని విమర్శించడం విశేషం. దేశంలోకాదు..ప్రపంచంలోనే అతి పెద్ద వెన్రుపోటుదారుడు చంద్రబాబు అని ఆయన అన్నారు. మూడు రాజదానుల విషయమై చంద్రబాబు సవాళ్లు విసరడాన్ని ఎద్దేవ చేస్తూ సుబ్బరాయుడు మాట్లాడారు. రాజీనామాలు చేయండని మాకు చెప్పడం కాదు.. దమ్ముంటే మీరు రాజీనామా చేసి.. మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిచి అప్పుడు చెప్పండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. మూడు రాజధానులు విషయంలో ప్రజలంతా స్వాగతిస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం, రియల్ ఎస్టేట్ కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు వల్ల రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందుతుంది' అని సుబ్బారాయుడు వ్యాఖ్యానించారు.

సుబ్బరాయుడు కొంతకాలం క్రితం వరకు టిడిపి నాయకుడే. అప్పుడే తెగపొగిడారు. ఇప్పుడు తెగ తిడుతున్నారా?

tags : kottapalli

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info