A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
Share |
September 19 2020, 4:42 am

అన్ని ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ పాలన జరపడం చాలా ముఖ్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. అభివృద్ది అంటే కేవలం రోడ్లు, డ్రెయిన్ లు, శిలాఫలకాలు వేయడం మాత్రమే కాదని, ప్రజల గౌరవాన్ని కాపాడడం కూడా అని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాల అబివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అన్ని ప్రాంతాల్లోని ప్రజల ఆత్మ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు నడవాలని తెలిపారు. రాయలసీమ ప్రజల అభీష్టాన్ని తుంగలో తొక్కిన చంద్రబాబు నాయుడు హైకోర్టును అమరావతిలో పెట్టారని, రాయలసీమ ప్రజల ఆత్మ గౌరవం నిలబడే విధంగా సీఎం జగన్ హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దానిని కూడా రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలన రాజధానిని అన్ని వసతులు ఉన్న విశాఖపట్నానికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారని కొడాలి నాని పేర్కొన్నారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఉంటే దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో అతి కొద్ది సమయంలోనే పోటీ పడవచ్చని అన్నారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని టీడీపీ , జనసేన అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆయన ద్వజమెత్తారు.

tags : kodali nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info