A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
Share |
September 19 2020, 4:50 am

తమిళనాడులో కూడా రెండో రాజధానిపై ఊహాగానాలు సాగుతు్నాయి. ఎపి గవర్నర్ విశ్వభూసణ్ హరిచందన్ ఎపి మూడు రాజధానుల చట్టానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపద్యంలో ఆ రాష్ట్రంలో దీనిపై చర్చ సాగుతోందని ఒక ఆంగ్ల పత్రిక కధనాన్ని ఇచ్చింది.తమిళనాడు దక్షిణభాగానికి కేంద్రంగా, తమిళనాడుకు మద్యలో ఉండే తిరుచ్చిలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా బలంగా ఉంది. చెన్నై నగరం ఒక పద్దతి లేకుండా పెరిగిపోవడంతో ప్రభుత్వం దాని నిర్వహణలో ఇబ్బంది పడుతోంది. ప్రజలకు కూడా సదుపాయల విషయంలో సమస్యలు వస్తున్నాయి. మొత్తం అబివృద్ది అంతా ఒకేచోట కే్ంద్రీకృతం అవడం వల్ల మిగిలిన ప్రాంతాలలో అభివృద్దికి అడ్డంకులు వస్తున్నాయని అంటున్నారు.అందువల్ల రెండో రాజధానిగా తిరుచ్చిని ఎంపిక చేయాలని అంటున్నారు. అయితే కొందరు నిపుణులు రెండో రాజదాని అని పేరు పెట్టకుండా,రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించి ఆయా నగరాలలో కొన్ని వభాగాలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎమ్.జి.రామచంద్రన్ టైమ్ లో తిరుచ్చి కేంద్రంగా రెండో రాజధాని ప్రతిపాదన వచ్చినా, ఆయన మరణం తర్వాత అది ఆగిపోయింది.కాగా తిరుచ్చిని రెండో రాజధాని అని ప్రకటించే రాజకీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

tags : tamilnadu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info