A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ప్రెస్ మీట్లు కామెడీ షో లు
Share |
September 22 2020, 2:08 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రెస్‌మీట్‌లు కామెడీ షోలా త‌యార‌య్యాయ‌ని ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు.ఆ కామెడీ షోలనే ఎల్లో మీడియా హైలెట్ చేసి చూపిస్తున్నాయ‌ని ఆయన ఎద్దేవ చేశారు. చంద్రబాబు 48 గంటల డెడ్ లైన్ అని ప్రకటన చేయడాన్ని శ్రీకాంతరెడ్డి తప్పుపట్టారు. తమ నేత జగన్ గతంలో వైఎస్ ఆర్ క కాంగ్రెస్ ను పెట్టినప్పుడు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలలో నిలబడ్డారని,అ లాగే దమ్ముంటే చంద్రబాబు కూడా రాజీనామా చేయాలని ఆయన సవాల్ చేశారు.

రాజ‌ధాని గురించి ఎన్నికల ముందు చెప్పలేదని బాబు అంటున్నార‌ని కానీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తాన‌ని జగన్ హామీ ఇచ్చార‌ని స్ప‌ష్టం చేశారు. అయినా చంద్ర‌బాబుకు రాయ‌ల‌సీమ వ‌చ్చి మాట్లాడే ద‌మ్ముందా? అని ప్ర‌శ్నించారు. ఇక్క‌డికి వ‌చ్చి హైకోర్టును వ‌ద్ద‌ని చెప్ప‌గలుగుతారా? అని ప్రశ్నించారు. ఇక‌నైనా రాయలసీమ టీడీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాల‌ని సూచించారు.

tags : gadikota

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info