A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తీవ్ర అనారోగ్యానికి గురైన నటుడు పృద్విరాజ్
Share |
September 22 2020, 2:07 pm

ప్రముఖ నటుడు పృద్విరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన ఈ విషయమై సెల్పీ వీడియోను పోస్టు చేశారు.శ్వాస తీసుకోవడానికి , మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారని సమాచారం వచ్చింది. ప‌ది రోజుల నుంచి తీవ్రమైన జ‌లుబు, అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాన‌ని ఆయన తెలిపారు. అన్నిర‌కాల ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, వాటిలో కోవిడ్ నెగెటివ్ వ‌చ్చిందని ఆయన పేర్కొన్నారు.అయినా డాక్టర్ ల సలహా మేరకు క్వారంటైన్ లో కేంద్రంలో ఉన్నానని, వారి సూచన మేరకు అర్దరాత్రి ఆస్పత్రిలో చేరానని ఆయన వివరించారు. అంద‌రి ఆశీస్సులు, వెంక‌టేశ్వ‌రస్వామి ఆశీర్వాదాలు త‌న‌కు ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాన‌ని ,త్వరగా కోలుకుంటానని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు.

tags : prdwi raj

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info