A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
Share |
September 22 2020, 2:14 pm

అమరావతి ప్రాంతానికి చెందిన కొందరు రోడ్డు పక్కన నిలబడి హైకోర్టు న్యాయమూర్తులకు దండం పెడుతున్నారంటూ వచ్చిన వార్త ఆసక్తికరంగా ఉంది. ఈ రోజు హైకోర్టులో మూడు రాజదానుల అంశంపై విచారణ వచ్చే అవకాశం ఉన్నందున వారు తాళ్లాయపాలెం నుంచి న ఏలపాడు వెళ్లే రోడ్డులో నిలబడి,మోకాళ్లప కూర్చుని న్యాయమూర్తులకు దండాలు పెట్టారన్నది కధనం. మూడు రాజధానులు వద్దని, మొత్తం అన్ని ఆఫీస్ లు ఇక్కడే ఉండాలన్నది వారి డీమాండ్ .న్యాయస్థానాలే తమను కాపాడాలని వారు కోరారట. వారు ఎక్కడైనా నిరసనలు చెప్పవచ్చు. కాని కోర్టులో పిటిషన్ విచారణ రానున్న తరుణంలో ఇలా న్యాయమూర్తులకు నమస్కారాలు పెడుతూ తమ వినతిని తెలియచేవచ్చా? ఇది న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడానికి ప్రయత్నమని ఎవరైనా ఆరోపిస్తే ఏమి సమాధానం వస్తుందన్నది ఆలోచించాలి. నిరసనలు చెప్పేవారు చట్టబద్దంగా తమకు హక్కు ఉందని వాదించవచ్చు కాని, ఇలా దండాలు ,దస్కాలు పెట్టడం ద్వారా న్యాయం తమమైపే ఉండాలని అనుకుంటే అది ఇబ్బందిగా మారుతుందేమో!

tags : amaravati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info