A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
Share |
September 22 2020, 2:16 pm

కరోనా సమస్యతో ముఖ్యమంత్రులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ కుటుంబంలో కరోనా కలకలం ఏర్పడింది. ఆయన కుటుంబంలోని ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో ముఖ్యమంత్రి ఐసొలేషన్ కు వెళ్లారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.తనకు కూడా పరీక్షలు నిర్వహించారనీ, ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని సీఎం చెప్పారు. అందువల్ల ముందు జాగ్రత్తగా తాను ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు.

tags : tripura

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info