A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
Share |
September 19 2020, 4:44 am

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేయడంపై వైసిపి నేతలు మండిపడుతున్నారు.తనకు దమ్ము లేక ఇలాంటి సవాళ్లు చేస్తున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. వైసిపిఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి అమరావతి ఎజెండాతో ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. శ్రీభాగ్ నుంచి శివరామకృష్ణన్ దాకా వికేంద్రీకరణకే నిపుణులు మొగ్గు చూపారని ఇక్బాల్ స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని ఆయన అన్నారు.

tags : ikbal

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info