A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
Share |
September 19 2020, 5:51 am

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో ఒకే తరహా చికిత్సను కరోనా బాదితులకు అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశాలు ఇచ్చారు. వైరస్‌ సోకిన రోగుల్లో ఎక్కువ మంది రోగం కంటే భయంతోనే మరణిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రోగులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, వారిలో నెలకొన్న భయాన్ని పోగొట్టాలని వైద్యులను ఆయన కోరారు. ఇతర రాష్ట్రాలు, దేశాలలో విజయవంతమైన చికిత్సా పద్ధతులు, ఔషధాలు ఏమైనా ఉంటే వాటిని కూడా మన దగ్గర అందుబాటులోకి తీసుకొస్తామని ఈటల తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న కొవిడ్‌ రోగులకు వైద్యం అందుతున్న తీరుపై సమాచారాన్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వారి కుటుంబ సభ్యులకు చేరవేసేందుకు సమన్వయకర్తలను నియమించాలని మంత్రి చెప్పారు.

tags : eetela

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info