A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
Share |
September 22 2020, 1:01 pm

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ
కార్యాలయాలలో సమర్దవంతమైన, కచ్చితమైన సేవలు అందించడానికి e-ఆఫీసును
ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ తెలిపారు.

సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సెక్రటేరియట్ లోని 8 శాఖలలో, HoD
లలో 2 శాఖలలో e-ఆఫీసును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ e-ఆఫీసు ద్వారా
పారదర్శకంగా , బాద్యతయుతంగా, వేగంగా ప్రాసెస్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు.
ఎక్కడ నుండైన పని చేయడానికి వీలుకలుగడంతోపాటు, సమర్దవంతమైన పాలనను
అందించవచ్చన్నారు. సెక్రటేరియట్ లోని వైద్య, ఆరోగ్య శాఖ, ప్లానింగ్ , కార్మిక శాఖ, బిసి
సంక్షేమం, షెడ్యూల్డ్ కూలాల అభివృద్ధి శాఖ , మైనారిటీ సంక్షేమం, గిరిజన సంక్షేమం,
హోంశాఖలతో పాటు , పి.సి.బి. వ్యవసాయ శాఖ కమీషనర్ కార్యాలయాలలో e-ఆఫీసును
ప్రారంభించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు సెక్రటేరియట్ లో 15 శాఖలలో e-ఆఫీసును
అమలుచేస్తున్నామన్నారు. మిగిలిన శాఖలలో e-ఆఫీస్ అమలును వారంలోగా పూర్తి
చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో కార్మిక శాఖ స్పెషల్ సి.యస్ శ్రీమతి రాణి కుముదిని, ఐ.టి. శాఖ
ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ , హోం శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రవి గుప్తా, పి.సి.బి.
మెంబర్ సెక్రటరి నీతూ కుమారి ప్రసాద్ , ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరి శ్రీ రోనాల్డ్ రోస్,
షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరి శ్రీ విజయ కుమార్ తదితరులు
పాల్గొన్నారు.

tags : someshkumar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info