A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
Share |
September 19 2020, 4:47 am

ఈ-రక్షాబంధన్ కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించామని, రాష్ట్రంలోని మహిళలు, విద్యార్థినులకు సైబర్ నేరాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తామని ఎపి హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై మహిళల రక్షనకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. మహిళలు సైబర్ నేరాలపై ఎలా పిర్యాదు చేయాలో కూడా అవగాహన కల్పిస్తామని అన్నారు. దిశా చట్టం ద్వారా మహిళలపై అరాచకాలకు అడ్డుకట్ట వేస్తున్నామని, అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని మహిళలకు ఒక అన్నగా అండగా నిలుస్తున్నారని సుచరిత చెప్పారు.

tags : sucharita

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info