A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేతల నిర్భంధం పై రాహుల్ వ్యాఖ్య
Share |
September 19 2020, 1:59 am

కశ్మీర్ లో రాజకీయ నేతలను అక్రమంగా నిర్బంధిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామాన్ని నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత గత ఏడాది ఆగస్ట్‌ 5 నుంచి మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నిర్బంధంలో ఉన్నారు. మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని జమ్ము కశ్మీర్‌ అధికారులు మరో మూడు నెలలు పొడిగించారు. గృహ నిర్బంధం నుంచి మెహబూబా ముఫ్తీని విడుదల చేయాలని కోరుతూ రాహుల్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. మెహబూబా నిర్బంధం పొడిగింపును కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం కూడా తప్పుపట్టారు.ఇది పౌరుల రాజ్యాంగ హక్కులను నిరాకరించడమేనని అన్నారు.

tags : rahulgandhi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info