A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు బొత్స సవాల్
Share |
September 19 2020, 12:52 am

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కు మంత్రి బొత్స సవాల్ చేశారు.దమ్ముంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని ఆయన సవాల్ చేశారు. చంద్రబాబుకు అంత నమ్మకం ఉంటే తన ఎమ్మెల్యేలతో, ఎమ్.పిలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రాగలరా అని ఆయన అన్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నామని చంద్రబాబు అంటున్నారని, వాటిలో అమరావతి కూడా ఉందని తెలుసుకోవాలని ఆయన అన్నారు. గ్రాఫిక్స్ చూపి రాజధాని పేరుతో ప్రజలను,రైతులను మోసం చేశారని ఆయన విమర్శించారు. తన బినామీలకు భూమి కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని బొత్స ద్వజమెత్తారు. చివరికి మంగళగిరిలో ఆయన కుమారుడు లోకేష్ కూడా ఓడిపోయారంటేనే ప్రజలు భావన ఏమిటో అర్దం చేసుకోవచ్చని అన్నారు. ఉత్తరాంద్రలో అడుగపెట్టే నైతిక అర్హత ను చంద్రబాబు కోల్పోయారని, అలాగే సొంత గడ్డ రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన అన్నారు.

tags : botsa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info