A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తల్లి పాలు బిడ్డకు గొప్ప ఆరోగ్యం: గవర్నర్
Share |
September 19 2020, 2:37 am

తల్లి పాలు శిశువులకు ఎంతో ఆరోగ్యదాయకమని, వాటిలో గొప్ప రోగ నిరోధకారాలు ఉంటాయని, అవి శిశువులను ఎన్నో
రోగాలనుండి కాపాడుతాయని గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు.
తల్లి పాల వారోత్సవాలను ఈరోజు రాజ్ భవన్ లో గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ తల్లి పాలు ఎంతో
విశిష్టమైనవి అని, తల్లి పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయని ఆమె వివరించారు.
కొందరు అపోహలతో తల్లి పాలు బిడ్డకు పట్టకు పోవడం సరికాదు అని, ఒక తల్లి తన బిడ్డ కు ఇచ్చే అతి ముఖ్యమైన తోలి
బహుమతి తల్లి పాలు అని డాక్టర్ తమిళి సై పేర్కొన్నారు.
ఈ సందర్భం గా రాజ్ భవన్ క్వార్టర్స్ లో ఉంటున్న కొందరు చిన్న పిల్లల తల్లులకు గవర్నర్ ప్రోటీన్ పొడి డబ్బాలు,
జింకోవిట్ డ్రాప్స్, త్రెప్తిన్ బిస్కెట్ లు, ఏ టూ జెడ్ ట్యాబ్లేట్ లు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమం లో రాజ్ భవన్ వైద్య సిబ్బంది, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

tags : tamilsai

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info