A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న పవన్
Share |
September 19 2020, 1:07 am

టీడీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు.రాజదాని రైతులకు అండగా ఉండాలని అనుకుంటే టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన అన్నారని కధనం. తమ ప్రాంతం నుంచి రాజధాని తరలిపోతున్నందున అమరావతిని నిలుపుకునేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలూ రాజీనామాలు చేసి పోరాటం చేయాలన్నారు. జనసేన పార్టీకి శాసన ప్రక్రియలో ఏ కొద్దిపాటి భాగస్వామ్యం ఉన్నా మొదటగా రాజీనామాలు చేసేదన్నారు.అమరావతి నిర్మాణంలో జనసేన ప్రమేయం లేదని ఆయన చెప్పారు. రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులతో, నిపుణులతో కూలంకషంగా చర్చించి ముందుకు వెళ్తాం అని ఆయన అన్నారు.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info