A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనాపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష
Share |
August 5 2020, 1:24 am

కరోనా కు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలను ఆయన ఇచ్చారు.కరోనా చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రుల్లో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్‌ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలని ఆయన చెప్పారు. సంబంధిత ఆస్పత్రిలో బ్లాక్‌ బోర్డు పెట్టి.. అక్కడి బెడ్ల ఖాళీ, భర్తీ వివరాలను అందులో రాయాలని ఆదేశించారు. ఎవరికైనా బెడ్‌ అందుబాటులో లేకపోతే.. వారిని సమీప ఆస్పత్రికి పంపించి అక్కడ బెడ్‌ అలాట్‌ చేయాలని తెలిపారు. . ‘బెడ్లు దొరకలేదనే పరిస్థితి ఉండకూడదు. హెల్ప్‌డెస్క్‌ల్లో ఆరోగ్య మిత్రలను ఉంచాలి. కోవిడ్‌ కోసం నిర్దేశించిన138 ఆస్పత్రుల యాజమాన్యంపై దృష్టిపెట్టండి. సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. హెల్ప్‌డెస్క్‌లో ఉన్నవారికి ఓరియంటేషన్‌ బాగుండాలి. హెల్ప్‌డెస్క్‌ ప్రభావవంతంగా పనిచేస్తే.. చాలావరకు సమస్యలు తగ్గుతాయి. బెడ్లు, వైద్యం, ఫుడ్, శానిటేషన్‌ బాగుందా లేదా అన్నదానిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి’ అన్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info