A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
12 మంది ప్రతిపక్ష నేతలపై నిషేధం
Share |
August 5 2020, 1:27 am

హాంకాంగ్ లో సెప్టెంబర్ లో జరగనున్న చట్టసభ ఎన్నికలలో పోటీచేయడానికి వీలు లేకుండా 12 మంది ప్రముఖ నేతలను ప్రభుత్వం నిషేధించింది. వీరంతా ప్రజాస్వామ్య ఉద్యమకారులు. హాంకాంగ్ లో ప్రజాస్వామ్యం ఉండాలని, చైనా భద్రతా చట్టం విధించరాదని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిషేధానికి గురైన వారిలో ప్రముఖ ఉద్యమ నేత జషువా వాంగ్ కూడా ఉన్నారు. వీరు హాంకాంగ్ నగర రాజ్యాంగాన్ని పరిరక్షించలేదని, హాంకాంగ్,బీజింగ్ ల పాలనను గౌరవించలేదని ప్రభుత్వం అబియోగం మోపింది.చైనా క్రూర చట్టాలను వ్యతిరేకిస్తున్నందునే తమ పై నిషేదం పెట్టారని వాంగ్ అన్నారు. కొద్ది రోజుల క్రితం ప్రజాస్వామ్యం కోరుతున్నవారు ఒక సర్వే చేసుకున్నారు.దాని ప్రకారం ప్రజాస్వామ్యం కోరుకునే అభ్యర్దులు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ నేపధ్యంలో వీరిని పోటీలో లేకుండా నిషేధించారని భావిస్తున్నారు.

tags : hongcong

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info