A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
2 టి.ఎమ్.సిల. నీటికి లక్ష కోట్లా
Share |
August 5 2020, 1:46 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కేవలం రెండు టి.ఎమ్.సిల నీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు వ్యయం చేశారని పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జరుగుతున్న ప్రయోజనానికి, వ్యయానికి మద్య చాలా అంతరం ఉందని ఆయన అన్నారు.ఎపి ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డి పాడు విస్తరణకు వెళితే ముఖ్యమంత్రి కెసిఆర్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన అన్నారు. నలభైనాలుగు వేల క్యూసెక్కుల స్థానే 80 వేల క్యూసెక్కుల కెపాసిటికి పెంచాలని ఎపి ప్రభుత్వం టెండర్లుపిలిచిందని, అది పూర్తి అయితే దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని ఆయన అన్నారు.

tags : uttamkumarreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info