A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
30 మంది విద్యార్దులకు ఒక క్లాస్ రూమ్- సాద్యమేనా
Share |
August 5 2020, 1:35 am

కొత్త విద్యా విధానం ప్రకారం ప్రతి క్లాస్ రూమ్ లో ముప్పై మంది విద్యార్దులు మించి ఉండరాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త విద్యా విధానంలో ఈ విషయం ప్రస్తావించారు. స్కూళ్లలో ప్రతి లెవెల్ లో ఈ విధంగా క్లాస్ రూమ్ లో విద్యార్దులు ఉండాలని కేంద్రం చెప్పడం బాగానే ఉంది. అంతేకాక బాగా వెనుకబడిన ప్రాంతాలు,బలహీనవర్గాలు ,చదువుకు నోచుకోని వర్గాలు ఉన్నచోట క్లాస్ రూమ్ కు పాతిక మందే ఉండాలని కూడా నిర్దేశించారు. అంటే ప్రతి ముప్పై మంది కి ఒక టీచర్ ఉండాలన్నమాట. ఎక్కువ మంది విద్యార్దులతో క్లాస్ రూమ్ లు ఉంటే ,పిల్లలకు పాఠ్యాంశాల బోధన కష్టం అవుతుందని, పిల్లలు అర్దం చేసుకోవడం కష్టమని అబిప్రాయ పడింది.

నిబంధన బాగానే ఉంది. దీనికి తగ్గట్లుగా మౌలిక వసతులు, టీచర్లు ఉంటేనే ఇది సఫలం అవుతుంది.

tags : class rooms

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info