A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి. ప్రజలకు టిఆర్ఎస్ రక్షణ కవచం-కెటిఆర్
Share |
August 5 2020, 1:51 am

తెలంగాణ ప్రలలకు రక్షణ కవచం టీఆర్‌ఎస్‌ పార్టీ అని మున్సిపల్ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కె.తారక రామారావు అన్నారు. 2001 జూలైలో జల దృశ్యం వేదికగా పార్టీ ఏర్పాటు అయిన మూహుర్తం చాలా బలమైనదని ఆయన అన్నారు. వంద సంవత్సరాల పాటు ఇలాగే పార్టీ ధృడండా ఉంటుందన్న ధీమాను వ్యక్తం చేశారు.గతంలో చంద్రబాబు పాలనలో జల దృశ్యం నుంచి తమను రోడ్డు పైకి గెంటేశారని, కానీ ముహూర్త బలంతో తామింత దూరం వచ్చినట్లు తెలిపారు. రోడ్డుపై పడ్డ పరిస్థితి నుంచి ఈ రోజు హైదరాబాద్ నడి బొడ్డున తెలంగాణ భవన్‌లో 60 లక్షల మందికి ఇన్సూరెన్స్ ఇచ్చే స్థాయికి ఎదిగామని తెలిపారు. 13 సంవత్సరాలు టీఆర్‌ఎస్‌ పార్టీపై అనేక కుట్రలు జరిగాయని, పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధి పథంలో సాగుతోందని ఆయన చెప్పారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info