A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖ ఇ.రాజధాని- టిడిపి నేత హర్షం
Share |
August 5 2020, 1:54 am

విశాఖపట్నం ను కార్యనిర్వాహక రాజధాని చేయడంపై విశాఖ టిడిపి నేతలు కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా స్వాగతించారని ప్రచారం జరుగుతోంది. ఒకవైపు టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అమరావతిలోనే రాజధాని మొత్తం ఉండాలని అంటున్న తరుణంలోనే ఆ పార్టీలో కందరు భిన్నాభిప్రాయాలు చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అదే సమయంలో కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బెటిక్ రవి అమరావతికి మద్దతుగా రాజీనామా చేస్తానని అనడం విశేషం. కాగా మాజీ వైస్ చాన్సలర్ కెఎస్ చలం మూడు రాజధానుల నిర్ణయాన్ని అభివృద్ధి కోసం ఆహ్వానించాల్సిందేనని అన్నారు . విశాఖలో పరిపాలన రాజధాని వల్ల ఉత్తరాంధ్రాతో పాటు కళింగాంధ్ర కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రాంత అస్తిత్వం నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు.

tags : tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info