A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
త్రిపుల్ తలాఖ్ కేసులు బాగా తగ్గిపోయాయి
Share |
August 13 2020, 11:10 am

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకు వచ్చిన త్రిపుల్ తలాఖ్ నిషేద చట్టం ప్రబావం బాగానే పనిచేస్తున్నట్లుగా ఉంది.గత ఏడాది కాలంలో త్రిపుల్ తలాఖ్ చెప్పి భార్యలకు విడాకులు ఇచ్చే కేసులు బాగా తగ్గాయి. 1985లో షాబానో కేసు లో సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పును కాదని, ఆనాటి రాజీవ్ గాందీ ప్రభుత్వం ముస్లింలలో సంప్రదాయాన్ని కొనసాగించింది. బిజెపి ప్రభుత్వం దానిని నిషేధించడం ద్వారా ముస్లిం మహిళలకు రక్షణ కల్పించాలని నిర్ణయించింది. 1985 నుంచి 2019 వరకు 362964 కేసులు నమోదు అయ్యాయి. అంటే ఏడాదికి 11264 కేసులు సగటున వచ్చాయి. కాని 2019 నుంచి ఒక ఏడాది కాలంలో కేవలం 1089 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో గతంలో ఏడాదికి 1865 కేసులు గతంలో ఉండగా, ఈ ఏడాదికాలంలో కేవలం 281 త్రిపుల్ తలాఖ్ ఘటనలు జరిగాయని కేంద్ర ప్రభుత్వ డేటా చెబుతోంది. మద్యప్రదేశ్ లో గతంలో సగటున 670 కేసులు ఉండగా, ఈ ఏడాది అవి కేవలం 32 మాత్రమే ఉన్నాయి. తెలంగాణ ,ఆంద్ర లలో కూడా గతంలో ఏడాదికి 1217 కేసులు చొప్పున నమోదు కాగా, ఈ ఏడాది కేవలం 203 కేసులే వచ్చాయి. పశ్చిమబెంగాల్, కేరళ తదితర రాష్ట్రాలలో కూడా త్రిపుల్ తలాఖ్ ఘటనలు బాగా తగ్గాయి. ముస్లిం మహిళలకు ఈ రకంగా మంచే జరిగిందని బావించాలి.

tags : triple talaq

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info