A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
3 రాజధానుల బిల్లు-ఎపి బిజెపి ప్రకటన
Share |
August 5 2020, 1:15 am

మూడురాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంపై భారతీయ జనతా పార్టీ ఎపి శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గవర్నర్‌ తన రాజ్యాంగ అధికారాలకు అనుగుణంగా, నిపుణులతో చర్చించి, నిబంధనలకు లోబడి మూడు రాజధానుల విషయంలో నిర్ణయం తీసుకున్నారని బీజేపీ వ్యాఖ్యానించింది. ‘ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలపైన ఉన్న గౌరవం కారణంగా గవర్నర్‌ నిర్ణయంపైన బీజేపీ ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయదు. ఇటువంటి ఉత్తమ ప్రమాణాలనే ఇతర పార్టీలు కూడా పాటిస్తాయని బీజేపీ ఆశించింది. కానీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాజ్యాంగ వ్యవస్థ అయిన గవర్నర్‌ను కూడా నిందించడం శోచనీయం. ఇది ఆయన అవకాశవాదానికి పరాకాష్ట’ అని వ్యాఖ్యానించింది. ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు వ్యవస్థలకు లోబడి ఉంటాయని, అవి అన్ని వేళలా ఒకేలా ఉంటాయని గుర్తు చేసింది.

tags : bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info