A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కన్నీరు వస్తోందన్న చంద్రబాబు నాయుడు
Share |
August 5 2020, 1:57 am

అమరావతి లాంటి ప్రాజెక్టుని చంపేస్తుంటే ఒక్కోసారి కళ్ల వెంట నీరు వస్తుందని ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పారు. తాను అనుభవించడానికి రాజధాని కట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యానని, 40 ఏళ్ల రాజకీయం తనకు ఇంకా ఏం కావాలి? అని ఆయన ప్రశ్నించారు. ఆరోగ్యం బాగుంటే మరో 10 సంవత్సరాలు ఎక్కువ బతికుంటాను. అమరావతి నాకోసమేమీ కాదు. ఏదో రోజు ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రోజు చీకటి రోజు అని.. తాను చెప్పిన మాట నిజమని, భవిష్యత్‌లో అంతా ఒప్పుకుంటారని చంద్రబాబు తెలిపారు.
............
అమరావతి పేరుతో రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కున్నప్పుడు,వారిపై కేసులు పెట్టినప్పుడు, వారి పంటలు తగులపెట్టిన ఘటనలు జరిగినప్పుడు వారి కళ్లలో నీళ్లు కనిపించలేదా అనాటి ముఖ్యమంత్రిగారికి..

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info