A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాతృభాషలోనే బోధన జయప్రదం-జనసేన
Share |
August 13 2020, 10:30 am

మాతృభాషలోనే బోధన జయప్రదం అని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఇది.
ఐదో తరగతి వరకు విద్యాబోధన మాతృ భాషలోనే జరగాలని నూతన విద్యా విధానంలో
నిర్ణయించడాన్ని జనసేన హర్షధ్వానాలతో స్వాగతిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో
ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు
జనసేన తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి విదితమే. జనసేన ఆంగ్ల మాధ్యమానికి ఏ
మాత్రం వ్యతిరేకం కాదు. అయితే తమ పిల్లలు మాతృభాషలోనా లేదా ఆంగ్ల
మాధ్యమంలో చదవాలా అనే విషయాన్ని తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేయాలని,
ఆంగ్ల మాధ్యమం ఐచ్ఛికంగా మాత్రమే ఉండాలని జనసేన కోరుతూ వస్తోంది. ఈ
నిర్ణయం జనసేన భావావేశంతో తీసుకున్నది కాదు. విద్యారంగంలో అపార అనుభవం ఉన్న
నిపుణులతో చర్చలు జరిపిన తరువాత తీసుకున్న ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం. మాతృ
భాషలో బోధన జరిగినప్పుడు గొప్ప ఫలితాలు ఆవిష్కృతమవుతాయని ఐక్యరాజ్య సమితికి
అనుబంధమైన యునెస్కో 2008లో ప్రకటించింది. అనేక పరిశోధనలు చేసిన తరువాత
యునెస్కో ఈ నిర్ణయానికి వచ్చింది.
ఈ నేపథ్యంలో సామాజిక బాధ్యతతో జనసేన... బోధన మాధ్యమం ఐచ్ఛికంగా
ఉండాలేగాని, తప్పనిసరి కాకూడదు అని కోరుతూ వస్తోంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు
తీసుకువెళ్ళడానికి గాని మన తెలుగు భాష, మన నదుల పరిరక్షణకు 'మన నది - మన నుడి'
కార్యక్రమానికి రూపకల్పన చేసి రాజముండ్రిలో మార్చి 14న జనసేన పార్టీ
ఆవిర్భావ సందర్భంగా ప్రారంభించాము. అంతకు ముందు తిరుపతిలో తెలుగు సాహితీ
స్రష్టలతో ఒక సమావేశం జరిపినప్పటికీ పూర్తి స్థాయి కార్యక్రమానికి
రాజమండ్రి లో అంకురార్పణ చేశాము. జనసేన కోరుకున్నది, నూతన విద్య విధానం కమిటీ
ఆలోచన ఒకేలా ఉండడం ఆనందం కలిగించింది. మన సంస్కృతి, సంప్రదాయాలు 
పరిఢవిల్లాలంటే మన భాషలు, మన నదులు సజీవంగా సాగిపోవాలి. అందువల్ల  తెలుగు భాష, మన
నదుల పరిరక్షణను జనసేన ఒక నిరంతర కార్యక్రమంగా స్వీకరించింది. కొవిడ్ మహమ్మారి
సద్దుమణిగాక ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకు వెళతామని ఈ సందర్భంగా
మనవి చేస్తున్నాను. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని నిర్ణయించిన
కమిటీ సభ్యులకు, కమిటీ సిఫార్సులను ఆమోదించిన గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ
గారి నాయకత్వంలోని బి.జె.పి. ప్రభుత్వానికి తెలుగు భాషాభిమానులు, జనసేన పార్టీ
తరపున  హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

tags : pawankalyan

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info