A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.లో ప్రైవేటు కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు
Share |
August 13 2020, 10:33 am

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల
నిర్వహణకు చేపట్టవలసిన తక్షణ చర్యలపై సమగ్ర
నివేదిక రూపొందించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి
పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ
తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. గురువారం
మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో
హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి,
మౌలిక వసతులు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ
సమావేశంలో హైదరాబాద్ DEO వెంకటనర్సమ్మ,
ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
కార్పోరేషన్ EE రవీందర్, మధ్యాహ్న బోజన
నిర్వాహకులు మన్నా ట్రస్ట్ CEO శ్రవణ్, పలువురు
డిప్యూటీ DEO లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి
శ్రీ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్
జిల్లాలో 745 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత,
ఉన్నత పాఠశాలలు ఉన్నాయని, వాటిలో అవసరమైన వసతులు,
సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను
ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రభుత్వ
పాఠశాలలలో మెరుగైన విద్యను అందించాలని, ప్రభుత్వ
విద్యనూ బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి శ్రీ
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని అన్నారు.
అందులో భాగంగానే సన్న బియ్యంతో విద్యార్ధులకు
మధ్యాహ్న భోజనం, వారంలో 3 రోజలు గ్రుడ్లు
ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం అందిస్తున్న విషయాన్ని
గుర్తుచేశారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యను
అందించాలనేది ప్రభుత్వ ఆశయం అన్నారు.ప్రభుత్వ

పాఠశాలలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి
త్వరలోనే విద్యాశాఖ మంత్రి శ్రీ సబితా
ఇంద్రారెడ్డి తో ఒక సమావేశం ఏర్పాటు
చేయనున్నట్లు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలిపారు. మీ మీ పరిధిలోని పాఠశాలలలో తనిఖీలు
నిర్వహించి పర్నిచర్, క్రీడాసామగ్రి, ప్రహారీ గోడలు,
విద్యుత్, త్రాగునీటి సౌకర్యం వంటి ఇతర సమస్యలను
గుర్తించి నివేదికలను రూపొందించాలని డిప్యూటీ DEO లను
మంత్రి ఆదేశించారు. నివేదికలు రూపొందించి సమర్పిస్తే
ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో ప్రాధాన్యత
క్రమంలో సమస్యల పరిష్కారానికి చర్యలు
తీసుకుంటామని అన్నారు. 10 నుండి 20 మంది కంటే తక్కువ
సంఖ్యలో విద్యార్దులు ఉన్న పాఠశాలలను గుర్తించి
వారిని సమీపంలోని పాఠశాలలకు సర్దుబాటు చేసేలా
అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఉపాద్యాయులు
అధికంగా ఉన్న పాఠశాలల నుండి అవసరమైన పాఠశాలల కు
మార్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.
అదేవిధంగా విద్యార్దులతో పాటు పాఠశాలల లో
మధ్యాహ్న భోజన వసతిని ఉపాద్యాయులకు కల్పించాలని
DEO ను మంత్రి ఆదేశించారు. తద్వారా బోజన నాణ్యతపై
సరైన అవగాహన ఉంటుందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల
పై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని,
దీంతో ప్రైవేట్ పాఠశాలల నిర్వహకులు ఇష్టానుసారంగా
వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్త్యం చేశారు,
అన్ లైన్ క్లాస్ ల పేరుతో విద్యార్ధుల
తల్లిదండ్రులను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు
ఫీజుల కోసం వేదిస్తున్నాయని, అలాంటి వారిని
ఉపేక్షించ వద్దని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు

విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని
స్పష్టం చేశారు. ఇకనైనా వారి వైఖరి మార్చుకోవాలని
అన్నారు. ప్రతి పాఠశాలలో వాచ్ మెన్ ను నియమించేలా
చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వశిక్ష అభియాన్
క్రింద వివిధ ప్రభుత్వ పాఠశాలలలో చేపట్టిన పనుల
ప్రగతి పై 5 గురు డిప్యూటీ DEO స్థాయి అధికారులతో ఒక
కమిటీని వేసి 10 రోజులలో పనులను తనిఖీ చేసి నివేదిక
సమర్పించాలని DEO వెంకట నర్సమ్మ ను మంత్రి
ఆదేశించారు.

tags : talsani

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info