A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్.అసెంబ్లీ ఎందుకో చెప్పలేదు
Share |
August 5 2020, 1:28 am

రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలను తాను అడ్డుకోలేదని ,ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సమావేశాలపై స్పష్టత ఇవ్వలేదని ఆ రాష్ట్ర గవర్నర్ కల్ రాజ్ మిశ్ర వ్యాఖ్యానించారు.ఒక మీడియాతో మా్ట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలను వద్దనలేదని ఆయన అన్నారు. అయితే పరిస్థితులు సరిగా లేవు కనుక తొలుత అంగీకరించలేదని, కాని ఆ తర్వాత ముఖ్యమంత్రి సాధారణ అసెంబ్లీ సమావేశాలా? లేక బలపరీక్ష సమావేశాలా అన్నది చెప్పలేదని ఆయన అన్నారు.రాజ్ భవన్ వద్ద సి.ఎమ్. దర్నాకు దిగడం దురదృష్టకరమని ఆయన చెప్పారు.
క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలకు గవర్నర్ కట్టుబడి ఉండాలనది వాస్తవమేనని కాని నిబందనలు, కోర్టు తీర్పులను కూడా గమనించాలి కదా అని ఆయన అన్నారు. ఆగస్ట్‌ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు అనుమతి ఇస్తున్నట్లు బుధవారం మిశ్రా పేర్కొన్నారు.

tags : cm rajastan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info