A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్నికలకు వెళదాం-చంద్రబాబు సవాల్
Share |
August 5 2020, 12:52 am

ఎపి గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ మూడు రాజదానుల బిల్లుకు ఆమోద ముద్ర వేయడాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు.ఇది ఐదు కోట్ల ప్రజలను,అమరావతి రైతులను మోసం చేయడమేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ పద్నాలుగు నెలలుగా విద్వంస పాలన చేస్తున్నారని ఆయన అన్నారు. రాజదానుల చట్టం, రాజధాని రద్దు చట్టంపై న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు.మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, అమరావతి జెఎసి పిలుపు మేరకు నిరసనలు తెలుపుతామని చంద్రబాబు అన్నారు.జగన్ ఈ విషయంలోమాట తప్పారని ఆయన ఆరోపించారు.రాజధాని అంశంపై వైసిపి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని, లేదా రిఫరెండం నిర్వహంచాలని ఆయన డిమాండ్ చేశారు.

tags : chandrababu, challenge

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info