A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతి అబివృద్దికి కట్టుబడి ఉన్నాం- బొత్స
Share |
August 5 2020, 1:49 am

అమరావతి ప్రాంతంలో ఆంద్రప్రదేశ్ లో ఒక భాగం అని, ఈ ప్రాంత అభివీద్ది తమ ప్రభుత్వ బాద్యత అని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. గత ప్రభుత్వం ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు హామీ ఇచ్చిన విధంగా ,వారికి ప్లాట్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వాటి అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన అన్నారు. అమరావతిలో ఏఏ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేది త్వరలోనే వెల్లడిస్తామని ఆయన అన్నారు. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజదాని గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు.అలాగే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయవలసి ఉందని,దానిని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ ది అని ఆయన అన్నారు.

tags : botsa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info