A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి పై దుష్ప్రచారం చేస్తున్నారు-జివిఎల్
Share |
August 5 2020, 12:54 am

తాను అదికారంలో ఉంటే కేంద్రం అసలు రాష్ట్రంలో జోక్యం చేసుకోకూడదని, చివరికి కేంద్ర వాహనాలు కూడా తిరగరాదని చెప్పిన టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రతిదానిలో కేంద్రం జోక్యం చేసుకోవాలని అంటున్నారని బిజెపి ఎమ్.పి ,అదికార ప్రతినిది జివిఎల్ నరసింహారావు అన్నారు.మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్రం పరిదిలోదని, ఫెడరల్ స్పూర్తిని గౌరవిస్తున్నామని ఆయన అన్నారు.కేంద్రం కావాలని ఈ బిల్లును అనుమతించిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది దుష్ప్రచారం తప్ప మరకొటి కాదని ఆయన అన్నారు. తాము ఫెడరల్ స్పూర్తికి అనుగుణంగా ,ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు.బెంగాల్ లో సైతం తాము ఎక్కడా పెడరల్ విదానానికి వ్యతిరేకంగా వెళ్లలేదని ఆయన అన్నారు. కర్నూలులో హైకోర్టు, రాయలసీమలో రాజదాని పెట్టాలని గతంలో కోరిన మాట నిజమేనని, అయితే ఇప్పుడు హైకోర్టు ఏర్పాటుకు సుప్రింకోర్టు నుంచి అనుమతి పొందవలసి ఉంటుందని ఆయన అన్నారు.

tags : gvl

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info