A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మూడు రాజదానుల బిల్లుకు గవర్నర్ ఓకే
Share |
August 5 2020, 1:50 am

ఆంపద్రప్రదేశ్ పాలనా వికేంద్రీకరణ బిల్లుకు, రాజధాని సంస్థ రద్దు బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు.శాసనసభ ఈ బిల్లులను రెండేసిసార్లు ఆమోదించడం, శాసనమండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుకునే ప్రయత్నం జరగడం, దానితో నిర్దిష్ట గడువు ముగిసే వరకు ఈ బిల్లులను గవర్నర్ వద్దకు పంపకుండా ప్రభుత్వం వద్దే ఉంచడం జరిగింది.తదుపరి గవర్నర్ కూడా తన వద్దకు వచ్చాక న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా జరిపారు. ఆ తర్వాత ఆమోద ముద్ర వేశారు.దీని ప్రకారం విశాఖ పట్నం కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుంది.ప్రతిపక్ష టిడిపి ఈ బిల్లులను కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు.అయితే బిజెపి నిర్దిష్టంగా రాజదాని పై నిర్ణయం తీసుకునే అదికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

tags : viswabhusan harichandan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info