A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరి ప్రైవేటు స్కూళ్లు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే?
Share |
August 5 2020, 1:00 am

మళ్లీ తెలుగు మీడియం , ఇంగ్లీష్ మీడియంపై చర్చలు జరుగుతున్నాయి. జాతీయ విద్యా విదానాన్ని కేంద్రం ప్రకటించడంతో టిడిపి మీడియా రెచ్చిపోయి,మిగిలిన విషయాలను వదలిపెట్టి కేవలం మాతృభాషకే ప్రాధాన్యం ఇస్తూ ప్రచారం చేశాయి. ఎపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నం చేశాయి.అయితే దానిపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ వివరణ ఇచ్చారు. కేంద్రం ఇచ్చింది సూచనేనని, అది కూడా అవకాశం ఉన్నంతమేరకు అని పేర్కొందని వివరించారు. ఒకవేళ తెలుగుమీడియం ప్రాదమిక విద్యను ప్రవేశ పెట్టాల్సి వస్తే ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేటు స్కూళ్లకు కూడా వర్తిస్తుందని ఆయన ప్రకటించారు. రామోజీరావుకు చెందిన రమాదేవీ స్కూల్ లో తెలుగుమీడియం ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. మేం ఇంగ్లిష్‌ మీడియంకు కట్టుబడి ఉన్నాం. తెలుగును ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యలేదు. ప్రతి ఒక్కరు మా గ్రామానికి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్ వస్తుంది అని ఎదురుచూస్తున్నారు. పూర్తిగా తెలుగుమీడియం ఉండాలంటే ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు రెండింటిలోను అమలు చేయాల్సి ఉంటుంది అని సురేష్ స్పష్టం చేశారు.

tags : adimulam suresh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info