A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో రైతు ఆత్మహత్య- రాజకీయ వివాదం
Share |
August 5 2020, 1:40 am

తెలంగాణ ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజకీయ వివాదంగా మారింది.వర్గల్ మండలం వేలూరులో నరిసింహులు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చేస్తూ,ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలో రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అతని మృతికి ప్రభుత్వ అధికారుల వేధింపులే కారణమని ప్రతిపక్షాలు, మృతుని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మంత్రి హరీష్‌రావు స్పందించారు. రైతు మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రైతు కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ ఊరిలో ప్రభుత్వ భూమి ఉంటే అందులో నుంచి నర్సింహులు కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇస్తామని అన్నారు. వాళ్ల అమ్మాయి చదువుకు కూడా ప్రభుత్వం తరఫున సాకారం అందిస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్‌ హయాంలోనే అతని భూమి లాక్కున్నారని అన్నారు. ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తే అది వారిపై పడిందన్నారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు రాజకీయాలు చేయడం చాలా బాధకరమని పేర్కొన్నారు.

tags : farmer, suicide

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info