A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి అప్పులు- జగన్ క్రెడిబిలిటి పెరిగినట్లా!
Share |
August 5 2020, 1:13 am

తెలుగుదేశం పార్టీ అదికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడుతుందన్నది జగమెరిగిన సంత్యం. అందులో పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు అలా రకరకాలుగా మాట్లాడిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా వారు వైరుద్యభరితమైన అంటే పరస్పర విరుద్దమైన మాటలు మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. వారి దృష్టిలో అదే రాజకీయం.తమతో అంటకాగే పత్రికలు,టీవీలు ఉన్నాయన్నది వారి ధైర్యం కావచ్చు. తాజాగా శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు అప్పులపై చేసిన ప్రకటన అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు మొహం చూసి అనేక దేశాల వాళ్లు, బాండ్లు కొనుగోలు చేసేవాళ్లు ఎగబడి అప్పులు ఇస్తున్నారని ప్రచారం చేసి, అప్పులు తేవడమే ఘనమైన విషయంగా ప్రచారం చేసిన టిడిపి నేతలు, టిడిపి పత్రికలువారు ఇప్పుడు జగన్ ప్రభుత్వం అంత అప్పు చేస్తోంది..ఇంత అప్పు చేస్తోంది అని కొంత నిజం,మరికొంత అబద్దం పోగు చేసి ప్రచారం చేస్తున్నారు.రాజధాని పేరుతో ఒకసారి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం బాండ్ల ద్వారా రెండువేల కోట్ల రూపాయలు సమీకరించింది. చంద్రబాబుకు, ఆయన ప్రభుత్వానికి ఉన్న క్రెడిబిలిటి అని టిడిపి మీడియా ఊదరగొట్టింది. చంద్రబాబు కాని, యనమల కాని చూశారా..మమ్మల్ని చూసే ఈ అప్పులు వచ్చాయని పదే,పదే చెప్పుకునేవారు.తీరా ఆ బాండ్లు ఎవరెవరు కొనుగోలు చేశారన్న వివరాలు బయటకు వచ్చాక,అంతా నివ్వెరపోయారు. ఇలాకూడా జనాన్ని మాయ చేయవచ్చా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చేనాటికి కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉందని టిడిపికి మద్దతు ఇచ్చే ఈనాడు పత్రికలోనే ఒక కధనం వచ్చింది.ఆ తర్వాత ఇదే యనమల, ఇతర నేతలు ఏమని చెప్పేవారు. జగన్ ముఖం చూసి ఎవరూ అప్పులు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదని హేళనగా మాట్లాడేవారు.ఏ ప్రభుత్వానికి అయినా ముఖ్యమంత్రుల ముఖాలు చూసి రుణాలు ఇస్తారన్న కొత్త ప్రచారాన్ని టిడిపి పెట్టింది. మరి అది నిజమే అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి జగన్ ముఖానికి విపరీతమైన విశ్వసనీయత ఉన్నట్లే కదా?ఎపి ప్రభుత్వానికి అప్పులే పుట్టకూడదన్నది వీరి దురాలోచన. కాని అప్పులు యధా ప్రకారం వస్తుండడంతో టిడిపి నేతలు స్వరం మార్చి అమ్మో ఇంత అప్పా అని అనడం ఆరంబించారు.వారంటే రాజకీయం కోసం మాట మార్చుతున్నారని అనుకోవచ్చు. మరి ఒక వర్గం మీడియాకు ఏమైంది. అప్పుడు అలా సమర్దించాం. ఇప్పుడు ఈ ప్రభుత్వ అప్పులను వ్యతిరేకిస్తే జనం నవ్వుతారన్న జ్ఞానం ఈ మీడియాకు ఉండాలి కదా..అబ్బే అదేమీ లేదు..అన్నిటిని వదలివేశారు. రాజకీయ పార్టీకి అయినా, మీడియాకు అయినా ప్రభుత్వాల అప్పుల మీద నిర్దిష్టమైన విధానం ఉండాలి తప్ప, ఇలా మాట మార్చి నవ్వులపాలు అవుతుండడమే విచారకరం.కరోనా నెపంతో అప్పులు తెస్తున్నారని యనమల అంటున్నారు. అంటే కరోనా సమస్య లేదా?లేక కరోనా సంక్షోభం ఉన్నా, దేశం అంతటికి ఆర్దిక సమస్యలు వచ్చినా, ఎపికి మాత్రం ఇబ్బడి ,ముబ్బడిగా ఆదాయం వచ్చిందని యనమల భావిస్తున్నారు. నాలుగు నెలలుగా ప్రభుత్వాలకు ఆదాయం ఎంత దారుణంగా పడిపోయింది యనమలకు తెలియకపోతే ఏమనుకోవాలి? ఇలాంటి నేతలనా ఇన్నాళ్లు ఆంద్ర ప్రజలు భరించారా అన్న డౌటు రాదా?ఏడాదికి డెబ్బై వేల కోట్ల అప్పు తెచ్చారని యనమల ఆరోపిస్తున్నారు.నిజమే.అప్పులు ఎవరు తెచ్చినా జాగ్రత్తగానే వాడాలి. చంద్రబాబు ప్రభుత్వంలో ఎలా విచ్చలవిడిగా ఖర్చు చేసింది ఎన్నడైనా యనమల ఆలోచించారా? చంద్రబాబు ఎన్ని క్యాంప్ ఆఫీస్ లు నిర్వహించింది. చివరికి హైదరాబాద్ లో పార్క్ హయత్ హోటల్ లో మకాం చేసి కోట్ల రూపాయల ప్రభుత్వ బిల్లు చెల్లించింది?ప్రత్యేక విమానాలలో విదశీయాత్రలు చేసి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టింది తెలియదా?రాజధాని శంకుస్థాపనల పేరుతో,పోలవరం సందర్శనలతో , ధర్మపోరాట దీక్షలు,నవనిర్మాణ దీక్షలు..ఇలా ఒకటేమిటి? అనేక ప్రహసనాలకు వందల కోట్లను నీళ్ల ప్రాయంలా ఖర్చు చేసిన యనమల ఎన్నడైనా ఆ విషయాలను వెనక్కి తిరిగి చూసుకున్నారా?సచివాలయ తాత్కాలిక భవనం నిర్మాణానికి చదరపు అడుగుకు పదివేల రూపాయలు ఖర్చు చేశారే.రాజదానిలో కిలో మీటర్ కు ఎక్కడ లేని విదంగా కిలోమీటర్ కు నలభై కోట్ల రూపాయల వ్యయం అంచనాలు వేశారే.ఇన్ని రకాలుగా చేసి,చివరికి నలభైవేల కోట్ల బిల్లులు పెండింగులో పెట్టి వెళ్లిన ఆనాటి గౌరవనీయ ఆర్దిక మంత్రి యనమల సమర్ధతేనా ఇదంతా అని అనుకోవాలా? ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్న యనమలకుగాని, ఆయన పార్టీ అదినేత చంద్రబాబు నాయుడుకు గాని కరోనా టైమ్ లో ఆదాయం పడిపోతే,అప్పులు తేకుండా జనాలను మాడ్చాలన్నది వారి కోరికా?జగన్ ప్రభుత్వం నలభైవేల కోట్లకుపైగా వివిధ సంక్షేమ పదకాలను అమలు చేసిందన్నది వాస్తవం కాదని చెప్పగలరా?లేదా ఆ స్కీములను వ్యతిరేకిస్తున్నామని అనగలరా?కాకపోతే అప్పుడు సంక్షేమ స్కీములలో కోతలు పెడుతున్నారని, ఇంకా పెన్షన్లు పెంచాలని ఒకసారి, డబ్బులన్ని తచ్చి పంచుతున్నారని మరోసారి అంటారు..అంతేకాదు..కరోనా వల్ల ఉపాది కోల్పోయేవారికి ఐదువేల చొప్పున, మరణించినవారికి పది లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసింది ఈ పార్టీ వారే.ఇవన్ని జగనే చేయాలట.ప్రదాని మోడీని వీరు ఏమీ అడగరట. ఎప్పుడు ఏది ప్రస్తుతమైతే దాని గురించే మాట్లాడడంలో నేర్పరులు ఈ టిడిపి నేతలు.వీరికి ఒక విధానం, సిద్దాంతం లేదు.ఎంతసేపు రాజకీయం తప్ప.ఒక వేళ నిజంగానే ఎపి ప్రభుత్వం అప్పులు విపరీతంగా పెరిగిపోతుంటే కేంద్రం ఒప్పుకుంటుందా?అసలు వారి అనుమతి లేకుండా అప్పులు చేయడం సాద్యమేనా? ఇన్ని విషయాలు తెలిసినా ప్రజలను మభ్య పెట్టి ఏమార్చాలన్న వారి యత్నం సాగదని గుర్తుంచుకోవాలి.అదే సమయంలో ఎపి ప్రభుత్వం కూడా అప్పులపై వస్తున్న విమర్శలు, వ్యాఖ్యలనండి..వాటిలో ఏవైనా వాస్తవాలు ఉంటే,భవిష్యత్తులో ఆర్దిక సమస్యలు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తపడాలి. స్కీములు అమలు చేస్తున్న మాట నిజమే. అలాగే వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టిన మాట వాస్తవమే.అయినా అప్పులు మరీ పెరిగిపోతే ఎలాంటి విపరిణామాలకైనా దారి తీస్తుందా అన్నది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.కాని ఈ కరోనా టైమ్ లో ప్రజలకు ఉపాది కొరవడిన తరుణంలో జగన్ స్కీములు ప్రజలను బాగా ఆదుకున్నాయన్నది పచ్చి నిజం. అలా ప్రజలలోకి జగన్ స్కీములు వెళ్లాయన్నదే టిడిపి వారి బాద కావచ్చు. ఏది ఏమైనా ఒకందుకు సంతోషించాలి. ఒకప్పుడు జగన్ కు అప్పే పుట్టదని ప్రచారం చేసిన తెలుగుదేశం నేతలే ఇప్పుడు అన్ని వేల కోట్ల అప్పు చేశారని అంటున్నారు.అంటే టిడిపి కన్నా,చంద్రబాబుకన్నా జగన్ విశ్వసనీయత అన్ని రెట్లు పెరిగిందని టిడిపి నేతలే ఒప్పుకున్నట్లయిందని చెప్పుకోవాలి.

tags : ap, debt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info