A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దళితుల్ని వైసిపికి దూరం చేయగలరా!
Share |
August 13 2020, 10:26 am

ఆంద్రప్రదేశ్ లో జరుగుతున్న ఘటనల ఆధారంగా ఆయా వర్గాలను ప్రభుత్వానికి దూరం చేయాలన్న ప్రయత్నం గట్టిగానే జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ఏ చిన్న అవకాశం వచ్చినా వదలిపెట్టడం లేదు.దానిని వీలైనంత పెద్దది చేసి సమాజంలో ఒక అశాంతి ఏర్పరచడానికి వ్యూహ రచన చేస్తున్నట్లు అనిపిస్తుంది.దానికి ప్రదాన కారణం దళిత వర్గాలు అత్యధిక శాతం వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అండగా ఉండడమే అని వేరే చెప్పనవసరం లేదు. సమాజంలో అసమానతలు అన్నవి వాస్తవం. తరతరాలుగా బడుగు వర్గాల వారు అణచివేతకు గురి అవుతున్నారు. ఇది అత్యంత దురదృస్టకరం. మనుషులంతా ఒక్కటే అన్న పేరుతో సినిమాలు కూడా చాలా ఏళ్లక్రితమే వచ్చాయి.కాని ఆ పరిస్థితి ఇప్పటికీ కొనసాగడం లేదు. అదే సమయంలో బడుగువర్గాల వారిలో కొందరు వేరే శక్తుల ప్రేరేపణకు గురి అయి నష్టపోతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఎపిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగువర్గాలకు అనుకూలమైన అనేక స్కీములను తీసుకు వచ్చారు. ఉదాహరణకు అమ్మ ఒడి, చేయూత,చిన్నపిల్లలకు జగనన్న గోరుముద్ద, చేనేత నేస్తం, మత్సకార నేస్తం..నాయిబ్రాహ్మణలు, దర్జీలు, ఆటో డ్రైవర్లు, ఇలా ఆయా వర్గాలవారు లబ్దిపొందేలా స్కీములు రూపొందించారు.వారికి నేరుగా డబ్బు అందుతోంది.ఇలా లబ్ది పొందుతున్నవారిలో అత్యధికులు దళితులు, బిసిలు, ఎస్టి,మైనార్టీ వర్గాలే అని వేరే చెప్పనవసరం లేదు దీంతో బడుగు వర్గాలలో ప్రభుత్వంపై వ్యతిరేకత తేవడం కష్టం అన్న భావన ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎక్కడ ఏ చిన్న ఘర్షణ జరిగినా, లేదా అవాంచనీయ ఘటన జరిగినా దానిని పెద్దది చేసి చూపించడం,దళితులకు ఏదో అయిపోతోందన్న భ్రమ కల్పించడానికి విశేషంగా యత్నిస్తున్నారు. నర్సీపట్నానికి చెందిన ఒక డాక్టర్ ఘటనతో ఈ ప్రక్రియ మొదలైంది.అలాగే చిత్తూరులో మరో మహిళా డాక్టర్ ఆరోపణలు. ఇదే సందర్భంలో కొద్దిమంది అన్యాయానికి గురైన మాట నిజమే. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం వద్ద దళిత యువకుడిపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. అలాగే చీరాలలో జరిగిన ఘటనలో ఒక యువకుడు మరణించడం విషాదం. ఏ పార్టీ అదికారంలో ఉన్నా కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. వెంటనే ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకోవాలి. అది ప్రభుత్వ బాద్యత.ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ ఘటనలపై వెంటనే స్పందించిన తీరును గమనించాలి.చిత్తూరు డాక్టర్ ఆరోపణలపై వెంటనే సిఐడి విచారణకు ఆదేశిస్తే ఆమె సహకరించలేదు.సీతానగరం ఘటనపై ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి మంత్రి విశ్వరూప్ ను అక్కడకు పంపించి బాదితుడిని పరామర్శించి సహాయ చర్యలు చేపట్టారు.అంతేకాదు.ఒక ఎస్.ఐ.ని, ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు.ఎస్.సి,ఎస్టి కేసు పెట్టారు. అంటే ప్రభుత్వం సరిగా స్పందించిందని అర్దం.అలాగే చీరాలలో లాక్ డౌన్ టైమ్ లో మోటారు సైకిల్ పై వెళుతున్న యువకుడితో ఏర్పడిన వివాదంలో ఒక యువకుడు గాయపడ్డాడు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు మరణించాడు.వెంటనే సి.ఎమ్. స్పందించి సంబంధిత పోలీసులపై చర్య తీసుకోవడమే కాకుండా పది లక్షల పరిహారం కూడా ప్రకటించారు.నిజానికి ఈ ఘటనలో ఆ యువకుడితో తగాదా దళితుడని రాలేదు.లాక్ డౌన్ ఉల్లంఘన అది. కాని దురదృష్ట వశాత్తు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే ఒక ప్రదాన పత్రిక దళిత యువకుడి మృతి అని పెద్ద హెడింగ్ పెట్టి ఆ వర్గాలలో అసంతృప్తి పెంచాలని ప్రయత్నించింది. ఈ పాయింట్ ఎందుకు చెప్పవలసి వస్తోందంటే ఒకప్పుడు కులాలను రెచ్చగొట్టేలా వార్తలు రాయవద్దని గతంలో సుద్దులు చెప్పిన ఈ పత్రిక ఇప్పుడు ఎలా విలువలు లేకుండా వ్యవహరిస్తోందని చెప్పడానికే. ఎందుకు ఇలా చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదా?చంద్రబాబు 2014-2019 మద్య అదికారంలో ఉన్నప్పుడు అనేక కేసులు వచ్చాయి.విశాఖ పట్నం వద్ద ఒక దళిత మహిళను వివస్త్రను చేసి కొట్టారన్న ఆరోపణలు వస్తే ఏ మేరకు ఆనాటి టిడిపి ప్రభుత్వం పట్టించుకుందన్నది గమనించాలి.దళితులలో ఎవరైనా పుట్టాలా అని చంద్రబాబే వ్యాఖ్యానించి ఆ వర్గాన్ని న్యూనతపరిస్తే,దలితులు పరిశుభ్రంగా ఉండరని టిడిపి మంత్రి ఆదినారాయణ రెడ్డి కామెంట్ చేసి వారిని అవమానించారు.ఒకసారి ట్రాక్ రికార్డు చూస్తే చంద్రబాబు టైమ్ లో 2015 లో ఎపిలో దిళితులపై దాడులు, అత్యాచారాలు,ఇతరత్రా దౌర్జన్యాల కు సంబందించి 1099 కేసులు నమోదు అయ్యాయి. అప్పట్లో దేశంలోనే ఎపి రెండో స్థానంలో ఉందని కేంద్రం తెలిపింది.2014లో ఎపిలో దళితులపై 957 దాడి ఘటనలు జరిగినట్లు కేసులు నమోదు అయ్యాయి.దళితులపై దాడి కేసులలో 2018 లో ఎపి ఐదో ర్యాంకులో ఉందని ఎస్సి కమిషన్ సభ్యుడు రాములు చెప్పారు.అంతేకాదు.టిడిపి అదికారంలోకి వచ్చిన కొత్తలో 1983లోనే చిత్తూరు జిల్లా పదిరికుప్పంలో నలుగురు దళితులను కొందరు సజీవ దహనం చేశారు. 1985లో ప్రకాశం జిల్లా కారంచేడు వద్ద ఆరుగురు హత్యకు గురయ్యారు. మరో ఇరవై మందఇ తీవ్రంగా గాయపడ్డారు. 1969 లో కంచకచర్లలో కోటేషు అనే వ్యక్తిని కొందరు దారుణంగా సజీవ దహనం చేశారు.1991లో చుండూరు వద్ద పదమూడు మంది హత్యకు గురయ్యారు. ఇలాంటి ఘటనలకు ,ప్రభుత్వాలకు సంబందం ఉండదు. ఆ తర్వాత ప్రభుత్వాలు వ్యవహరించే తీరు ముఖ్యమైనది.చంద్రబాబు టైమ్ లో తుందుర్రు గ్రామలో జరిగన గొడవపై ప్రభుత్వం పట్టించుకోనేలేదన్న విమర్శ ఉందిఅంతెందుకు గతంలో ఎస్సిల వర్గీకరణ అని షెడ్యూల్ కులాలల్ విభజన తెచ్చిన చంద్రబాబు నాయుడు 2014 లో అదికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తలేదు.మందకృష్ణ మాదిగ చలో అమరావతి పెడితే ఏ రకంగా నిర్భందం చేసింది చూశాం. కాని ఇప్పుడు ఏ చిన్న ఘటన జరిగినా చంద్రబాబు అమ్మో దళితులు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఘటన జరిగినప్పుడు స్పందించడం తప్పు కాదు. ఉన్నవి,లేనివి చెప్ప కులా ల మద్య చిచ్చు పెట్టడం సరికాదు. దీనికి కారణం ఒకటే 2019 ఎన్నికలలో దళితవర్గాలలో అత్యదిక శాతం వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అండగా ఉన్నారు.అందువల్లనే రిజర్వుడు నియోజకవర్గాలు 29 కి గాను 27 చోట్ల వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలిచింది. టిడిపికి ఒక సీటు రాగా, మరో సీటు జనసేనవచ్చింది. 2014లో టిడిపి అదికారంలోకి వచ్చిన రిజర్వుడు సీట్లు ఈ రెండు పార్టీలకు పోటాపోటీగా వచ్చాయి. టిడిపకి పదహారు వస్తే, వైసిపికి 13 వచ్చాయి. దళితులలో చీలిక తీసుకు రావడం, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచడం కోసం టిడిపికాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా కాని తంటాలు పడుతున్నాయి. జగన్ ఎక్కడ ఏ ఘటన జరిగినా స్పందించడం ద్వారా, ప్రభుత్వ పరంగా కఠినంగా వ్యవహరించడం ద్వారా, అలాగే తన స్కీములను సమర్దంగా అమలు చేసినంతకాలం ఇబ్బంది ఉండదు.అయినా చంద్రబాబుకాని, టిడిపి మీడియా కాని ప్రతి చిన్న అంశాన్ని బూతద్దంలో చూపించడం మానుకుంటారని అనుకోనవసరం లేదు. దానికి తగ్టట్టుగానే ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండకతప్పదు.

tags : ap,dalits

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info