A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మెగా డెయిరీకి 32 ఎకరాల లీజు
Share |
August 5 2020, 1:20 am

ఆధునిక టెక్నాలజీ తో 250 కోట్ల రూపాయల వ్యయంతో
ఏర్పాటు చేసే మెగా డైరీ నుండి మరిన్ని విజయ
ఉత్పత్తులు ప్రారంభించాలని పశుసంవర్ధక, మత్స్య,
పాడి పరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి
శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం
మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో
రంగారెడ్డి జిల్లా మామిడి పల్లి లో మెగా డైరీ
నిర్మాణం కోసం పశుసంవర్ధక శాఖ కు చెందిన 32 ఎకరాల
భూమిని విజయ డైరీకి 99 సంవత్సరాలు లీజుకు ఇస్తూ
మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్ధక
శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర సమక్షంలో
పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, డైరీ md
శ్రీనివాస్ రావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ
సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీని
తో ఏర్పాటు చేయనున్న మెగాడైరీ నమూనా త్వరలో
సిద్దం చేయాలని మంత్రి డైరీ md ని ఆదేశించారు. ఈ
కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ రాంచందర్
తదితరులు ఉన్నారు.

tags : talasani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info