A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోర్టుల్లో పిటీషన్లు నేరుగా స్వీకరించాలి-పవన్ కళ్యాణ్
Share |
August 13 2020, 11:02 am

ప్రజలకు అవసరమైన సంక్షేమాలు అందిస్తూ వారి ప్రయోజనాలు
పరిరక్షించాల్సిన ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసేస్తే సగటు
మనిషికి న్యాయం జరిగే పరిస్థితి లేకుండా పోతుందని జనసేన అధ్యక్షులు
పవన్ కల్యాణ్ చెప్పారు. సగటు మనిషి ప్రయోజనాలు రక్షించి
గుండె ధైర్యాన్ని జనసేన అందిస్తుందని తెలిపారు. ఈ బృహత్కార్యంలో
న్యాయవాదులు కీలక భూమిక పోషించాలన్నారు. ప్రభుత్వం ప్రజా
ప్రయోజనాలు కాపాడకుండా... అందుకు భిన్నంగా వెళ్తున్న పక్షంలో బాధిత
ప్రజలకు అవసరమైన న్యాయ సహాయం జనసేన తరఫున చేద్దామన్నారు.
బుధవారం ఉదయం పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో పవన్ కల్యాణ్
టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు నాలుగున్నర గంటలపాటు ఈ
చర్చ సాగింది. ఇటీవల ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై ఉన్నత న్యాయస్థానాలు
ఇచ్చిన తీర్పులు, వెలువరించిన అభిప్రాయాలూ, న్యాయ వ్యవస్థపై
అధికార పక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా
మాట్లాడినవారిపై పోలీస్ వేధింపులు తదితర అంశాలపై చర్చించారు. ఈ
కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ
నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “ప్రజల క్షేమాన్ని
దృష్టిలో ఉంచుకొని పని చేయాల్సిన విభాగాలు, కాపాడాల్సిన పోలీస్
వ్యవస్థ పాలకపక్ష వైఖరితో నలిగిపోతున్నాయి. కొందరు అధికారులు
కార్యకర్తల్లా మారిపోయారు. అధికార పార్టీకి కొమ్ము కాసేలా పని
చేస్తుంటే సామాన్య ప్రజలకు ఏం న్యాయం లభిస్తుంది. వాళ్ళకు రక్షణ
ఎలా దొరుకుతుంది. సగటు ప్రజల కష్టాలను, వారి ఈతిబాధలను, ఆందోళనలు
దృష్టిలో ఉంచుకోవాలి.

• మంచి చేసేవారు మాటలుపడాల్సి వస్తుంది
పాలన వ్యవస్థ నుంచి చట్టబద్ధంగా రక్షణ, ప్రయోజనాలు లభించక, ఏం చేయాలో
తెలియని స్థితిలో ఉన్నవారికి అండగా నిలుద్దాం. ఇందుకు పార్టీ లీగల్ సెల్
సహకారం అవసరం. అలాగే మన పార్టీ కోసం పని చేస్తూ ప్రభుత్వ ఒత్తిళ్లతో
అక్రమంగాపెట్టిన కేసుల్లో చిక్కుకున్నవారికి కావల్సిన న్యాయ సహాయం
చేయాలి. మరింతగా ఈ విభాగాన్ని బలోపేతం చేసి బాధిత ప్రజలకు భరోసా ఇద్దాం.
ప్రజల పట్ల సానుభూతి ఉన్న న్యాయవాదుల సహకారం మరింత పొందుదాం” అన్నారు.
పార్టీ దృక్పథాన్ని తెలియచేస్తూ “రాజకీయ వ్యవస్థ ద్వారా ప్రజలకు
అవసరమైన సేవలు అందిస్తూ సైద్ధాంతిక బలంతో అందరినీ కలుపుకొని వెళ్తుంది
జనసేన. మనం అనుకొన్న విషయాన్ని బలంగా చెప్పగలుగుతున్నాం. ఒక సమస్య గురించి
చెబితే కదలిక వస్తుంది. ఇలాంటి తరుణంలో ఎదుటి పక్షాలు మనల్ని అవమానిస్తాయి.
ఆ అవమాన భారాన్ని నేను భరించి తట్టుకొంటున్నవాడినే. కానీ మన లక్ష్యాన్ని,
ఉద్దేశాన్ని ఆ మాటలు ఆపలేవు.
• న్యాయవాదులకు అండగా ఉంటాం
సహజ న్యాయ సూత్రాలను కాపాడుతూ, చట్ట విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా
నిలువరించే పరిజ్ఞానం ఉన్న న్యాయవాద వ్యవస్థ ఈ సమాజంలో ఎంతో కీలకం.
ఎంతో జ్ఞాన సంపద ఉన్నా వారికి దక్కాల్సిన ప్రయోజనాలు దక్కడం లేదు. కరోనా
పరిస్థితుల్లో ఎందరో న్యాయవాదులు ఆ మహమ్మారి బారినపడ్డారని తెలిసింది.
న్యాయవాదులకు ఆరోగ్య బీమాను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి.
న్యాయవాదుల సంక్షేమానికి ఉద్దేశించిన నిధులను విడుదల చేసి వారి
ప్రయోజనాలను కాపాడాలి. అలాగే కోర్టుల్లో ఆన్ లైన్ పిటీషన్లనే
తీసుకొంటున్నారనే విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. పూర్తి సాంకేతికత
అందుబాటులోకి రాలేదు కాబట్టి నేరుగా కూడా పిటీషన్లు స్వీకరించే విధానాన్ని
కూడా అమలు చేయాలి” అన్నారు.
• స్వచ్ఛందంగా ముందుకు వెళ్ళండి: శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
మాట్లాడుతూ “పార్టీ లీగల్ సెల్ ద్వారా పార్టీ శ్రేణులు, నాయకులకు
ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు అందిస్తున్నాం. ఏ సమయంలో ఎవరికి ఇబ్బంది
వచ్చినా తగిన న్యాయ సహాయం ఇస్తున్నారు. ఈ విభాగాన్ని క్షేత్ర స్థాయి
వరకూ బలోపేతం చేద్దాం. పార్టీ అధ్యక్షులవారిపై, పార్టీపై
దురుద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో, ఇతర మాధ్యమాల్లో
వ్యాఖ్యలు చేస్తూ, తప్పుడు మాటలు మాట్లాడేవారిపై లీగల్ సెల్ విభాగం
స్వచ్ఛందంగా స్పందించి ముందుకు వెళ్ళాలి. చట్ట పరిధిలో తీసుకోవాల్సిన
చర్యలకు సంబంధించిన ప్రక్రియ చేపట్టాలి” అన్నారు. పార్టీ ప్రధాన
కార్యదర్శి శ్రీ టి.శివశంకర్ గారు మాట్లాడుతూ “పార్టీలో లీగల్ విభాగం ఎంతో
క్రియాశీలకమైనది. రాజకీయ అంశాలకే పరిమితం కాకుండా ప్రజా ప్రయోజనాలను మన
అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు దృష్టిలో ఉంచుకున్నారు. ఆ దిశగా ఈ
విభాగం ముందుకు వెళ్తుంది. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో ఇళ్ల స్థలాల
కోసం పేదల భూములను ప్రభుత్వం తీసేసుకొంది. అప్పుడు ఆ పేద ప్రజలకు జనసేన
పార్టీ న్యాయపరమైన అండనిచ్చింది” అని చెప్పారు.

tags : pawankalyan

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info