A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పైలట్ బిజెపి ట్రాప్ లోకి వెళ్లినట్లేనా
Share |
August 5 2020, 1:45 am

రాజస్తాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ పరిస్థితి అయోమయంలో పడిందా?తిరుగుబాటు మొదలైన రోజుల్లో ఆయనపై కాంగ్రెస్ లో సానుభూతి ఎక్కువగా ఉందన్న అభప్రియం ఉంది. సోనియాగాందీ, రాహుల్ గాంధీ,ప్రియాంక తదితరులు ఆయనను తిరిగి పార్టీలోకి రావాలని కోరినప్పుడు ఆయనకు బాగా వెయిట్ వచ్చింది. కాని ఆయన కండిషన్లు పెట్టడం ,అవి నెరవేరకపోవడంతో ఇప్పుడు ఇరవై మంది ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టుకున్నారు. బిజెపి అండతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారన్న భావన పెరగడంతో పైలట్ పై సానుభూతి తగ్గిందని చెబుతున్నారు. అసెంబ్లీని సమావేశపరచడంపై పైలట్‌ ఎందుకు మౌనంగా ఉంటున్నారని పార్టీ నేతలు ఆయనను నిలదీస్తున్నారు. 20, 25 మంది ఎమ్మెల్యేలతో పైలట్‌ ముఖ్యమంత్రి కాలేరని, బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పైలట్‌కు పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతుంటే ముఖ‍్యమంత్రి గహ్లోత్‌ మాత్రం విమర్శలతో చెలరేగుతున్నారని పైలట్‌ వర్గీయులు అంటున్నారు. ఇది ద్వంద్వ ప్రమాణాలను అనుసరించడం కాదా అని పైలట్‌ శిబిరం ప్రశ్నిస్తోంది. అసెంబ్లీని సమావేశపరిస్తే పైలట్‌ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది ఆసక్తి రేపుతోంది.

tags : sachin

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info