A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాతృభాష-ప్రసార మాద్యమాలకు వెంకయ్య పిలుపు
Share |
August 5 2020, 1:55 am

ప్రసార, ప్రచార మాధ్యమాలు కూడా మాతృభాషకు వీలైనంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు ఇచ్చారు. ఆయన మాతృభాష సెమినార్ లో ప్రసంగించారు. పాత పదాలను పునర్వినియోగంలోకి తీసుకురావడంతోపాటు కొత్త పదాలను సృష్టించడంపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. ఇందుకోసం కాశీనాథుని నాగేశ్వరరావు.. నైట్రోజన్‌ను నత్రజని అని, ఆక్సీజన్‌ను ప్రాణవాయువని, ఫొటో సింథసిస్‌ను కిరణజన్య సంయోగక్రియ అనే అద్భుతమైన పదాలను సృష్టించి తెలుగు ప్రజలకు పరిచయం చేశారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రయోగాల ద్వారానే భాషతోపాటు పత్రికల మనుగడ సాధ్యమవుతుందన్నారు.ప్రాథమిక విద్యాభ్యాసం కచ్చితంగా మాతృభాషలోనే జరగడం, ఉన్నత విద్యలో తెలుగు తప్పనిసరిగా ఒక విషయంగా ఉండటం వల్ల విద్యార్థుల్లో మాతృభాషపై ఆసక్తిని, వివిధ విషయాల గ్రహణశక్తిని పెంపొందింపజేయవచ్చన్నారు.
వివిధ దేశాధినేతలు మన దేశానికి వచ్చినపుడు.. ఆంగ్ల భాషలో పరిజ్ఞానం ఉన్నప్పటికీ వారి మాతృభాషలోనే సంభాషిస్తారని.. పక్కనున్న అనువాదకులు దీన్ని అనువాదం చేస్తారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా విదేశాల్లోనూ హిందీలోనే సంభాషిస్తారని.. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన నేతల్లో ఒకరిగా నిలిచారని ప్రస్తావించారు. మాతృభాషకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గౌరవానికి ఇది నిదర్శనమన్నారు.

tags : venkayya naidu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info