A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
3 రాజధానులు -కేంద్రం జోక్యం చేసుకోదు-సోము
Share |
August 5 2020, 1:26 am

మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని కొత్త బిజెపి అద్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారని వార్త వచ్చింది. దీంతో టిడిపి నుంచి బిజెపిలో చేరిన ఎమ్.పి సుజనా చౌదరి వంటివారికి ఈ విషయం మింగుడుపడని విదంగా ఉందని అనుకోవాలి. డిల్లీలో వీర్రాజు మాట్లాడుతూ దేశంలో అనేక చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని ఆయన అన్నారు. రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతూ.. కథలు చెప్పారని విమర్శించారు. చంద్రబాబు మాటలపై కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు కూడా మూడు రాజధానిలో విషయంలోనూ అదే వైఖరితో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే రాజధాని రైతులకు న్యాయం జరగాలన్న తమ నినాదానికి చివరి వరకు కట్టుబడి ఉంటామని వీర్రాజు తెలిపారు. రాజధానిపై టీడీపీ నేతలు బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.

tags : veeraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info