A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తలసాని పట్టుపడితే వదలడు
Share |
August 5 2020, 2:05 am

మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పట్టుదలను మున్సిపల్ మంత్రి కెటిఆర్ మెచ్చుకున్నారు. సనత్ నగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 68 కోట్లతో రైల్వే అండర్ బ్రిడ్జి, రూ. 45 కోట్లతో ఫతేనగర్ ఫ్లై ఓవర్ నాలుగు లైన్‌ల రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. రైల్వే అండర్‌‌ బ్రిడ్జి వల్ల షతేనగర్‌‌, సనత్‌నగర్‌‌ మెయిన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుందని కేటీఆర్‌‌ అన్నారు. ఏడాదిలోనే దీని నిర్మాణ పనులను పూర్తి చేస్తామని అన్నారు. సనత్ నగర్ నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతోందని, డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా ఇక్కడే ప్రారంభించించామని, ఇప్పుడు ఎన్నో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నామని కేటీఆర్‌‌ తెలిపారు. సనత్ నగర్ ప్రజలు అదృష్టవంతులని, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక పని పట్టుకుంటే అయిపోయేదకా వడలదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. బాలా నగర్ ఫ్లై ఓవర్ సెప్టెంబర్ కల్లా పూర్తవుతుంది అని చెప్పారు. కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info