A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముందుగా టిడిపిని వీక్ చేయడమే బిజెపి వ్యూహం
Share |
August 5 2020, 1:38 am

గవర్నర్‌ వద్ద ఉన్న మూడు రాజధానుల బిల్లు విషయమై ఎపి బిజెపి అద్యక్షుడుగా మొన్నటి వరకు ఉన్న కన్నా లక్ష్మీనారాయణ రాసిన లేఖ ఆయన కొంప ముంచిందని అంటున్నారని టిడిపి కి మద్దతు ఇచ్చే ఒక పత్రిక కదనాన్ని ఇచ్చింది. అంతేకాక పశ్చిమబెంగాల్,త్రిపుర తరహాలలో ముందుగా ప్రతిపక్షమైన టిడిపి ని బలహీనపర్చడానికి సోము వీర్రాజును ఎంపిక చేశారని కూడా ఆ పత్రిక విశ్లేషించింది. సుజనాతో దోస్తీ, చంద్రబాబు డబ్బులిచ్చి లక్ష్మీనారాయణతో మాట్లాడిస్తున్నారని విజయసాయిరెడ్డి పదేపదే చేసిన ఆరోపణలు కూడా ముప్పు తెచ్చాయని పేర్కొంది.కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులకు జగన్‌ ఉభయ సభల్లో మద్దతిస్తూ వస్తున్నారు. దీంతో వైసీపీని అలా వదిలేసి, టీడీపీని బలహీనం చేస్తే రాష్ట్రంలో బలపడవచ్చునని బీజేపీ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.

tags : bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info