A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
Share |
August 11 2020, 1:03 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీపై కుట్రలు జరుగుతున్నాయనడానికి ఇది ఉదాహరణ కావచ్చు. కొంతకాలం నుంచి టిడిపి మీడియా వైఎస్ ఆర్ కాంగ్రెస్ రద్దు అవుతుందని ప్రచారం చేయడం ,వారి ట్రాప్ లో పడ్డ నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజు కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ కాదు..యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పేరు వాడాలని చెప్పడం ..ఇవన్ని కుట్రలుగానే కనిపిస్తాయి.దానికి తోడు సడన్ గా ఒక వ్యక్తి తనది అన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ అని, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అన్న పదాలను తాను మాత్రమే వాడాలని కోరుతూ డిల్లీ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది.డిల్లీ దాకా వెళ్లి కోర్టులో పిటిషన్ లు వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది.దీని వెనుక ఎవరో పెద్దల హస్తం లేకుండా ఉంటుందా అన్న సందేహం సహజంగానే వస్తుంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ YSRCPతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. సెప్టెంబరు 3 లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని YSRCPతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. న్యాయ వ్యవస్థను అడ్డు పెట్టుకుని ఏదో రకంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని టిడిపి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో కుట్రలను ఎదుర్కున్న వైసిపి దీనిని ఎదుర్కోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు కాని జాగ్రత్తగా మాత్రం ఉండాలి.

tags : ysr congress

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info