A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
Share |
August 11 2020, 12:09 pm

తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేస్తున్నందున ప్రగతి భవన్‌ను కరోనా వైద్య కేంద్రంగా ప్రకటించాలని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎల్‌.రమణ డిమాండ్‌ చేశారు. వైద్య సాయం గాలికి వదిలివేసి సచివాలయం కూల్చివేత పనుల్లో ముఖ్యమంత్రి బిజీ అయ్యారని ఆయన అన్నారు.గన్‌పార్క్‌ అమర వీరుల స్మారక స్ధూపం వద్ద నివాళులర్పించిన తర్వాత సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన నిరసన ప్రదర్శనను పోలీసులు విఫలం చేశారు. గన్‌పార్క్‌ వద్దకు చేరుకున్న తెలంగాణ జనసమితి అద్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను పోలీసులు అమరవీరుల స్మారక స్ధూపం వద్దకు రాకుండా అక్కడి నుంచి తరలించారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీడీపీ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ (ఎంఎల్‌)న్యూ డెమోక్రసీ నాయకులు కె.గోవర్దన్‌ కారులో రాగానే పోలీసులు కిందికి దిగకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ మాజీ శాసనసభ్యులు ,ఎఐసిసి కార్యదర్శి సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ పాలనను గాలికి వదిలేసిన కేసీఆర్‌ కరోనా వైద్యసేవలను విస్మరిస్తున్నారని అన్నారు.

tags : l ramana

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info