A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
Share |
August 11 2020, 1:08 pm

రాష్ట్రంలో కరోనా మహామ్మారి తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో కఠిన నిబంధనలకు ఉపక్రమిస్తోంది. ఇప్పటికే రెడ్‌జోన్‌గా ఉన్న డివిజన్లలో అనధికార లాక్‌డౌన్‌ను యంత్రాంగం విధిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఆదివారం పూర్తిగా దుకాణాలు, వ్యాపార సముదాయాలన్నింటిని మూసివేయిస్తున్నారు. అలాగే వ్యాపార టైమింగ్స్‌ను కూడా మార్పు చేస్తున్నారు. ఉదయం ఆరు నుంచి 11గంటల వరకే ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న మండలాలను రాష్ట్రప్రభుత్వం తాజాగా లెక్కకట్టింది. ఆదివారం రికార్డు స్థాయిలో 1933 కేసులు నమోదుకావటం, 19 మరణలు సంభవించటంతో ప్రభు త్వం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, కేంద్రం జారీ చేసిన తాజా నిబంధనలను ఈ నెల 20వ తేదీ నుంచి రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో అమలుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా ప్రభావం అత్యంత దారుణంగా ఉన్న 97 మండలాలను గుర్తించి, వాటిని తాజాగా రెడ్‌జోన్‌ పరిధిలోకి తెచ్చింది. ఈ రెడ్‌ జోన్‌ మండలాల్లో 14 రోజుల పాటు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదుకాకపోతే వాటిని ఆరెంజ్‌ జోన్‌లోకి, ఆ తర్వాత 14 రోజులు ఒక్క కేసుకూడా రాకపోతే గ్రీన్‌ జోన్‌లోకి మారుస్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 666 మండలాలు ఉండగా, వాటిలో అత్యధిక పట్టణీకరణ, జనసంద్రత ఉన్న మండలాల్లోనే కరోనా వైరస్‌ ఉత్పాతం సృష్టిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 97 మండలాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. విశాఖపట్నం, విశాఖలోని పద్మనాభం, నర్సీపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం గ్రామీణం, కాకినాడ గ్రామీణం, పిఠాపురం పట్టణం, రాజమండ్రి, అడ్డతీగల, పెద్దాపురం పట్టణం, రాజమహేంద్రవరం గ్రామీణం, పశ్చిమగోదావరిలోని ఏలూరు పట్టణం, పెనుగొండ గ్రామీణ మండలం, భీమవరం, తాడేపల్లి గూడెం పట్టణాలు, ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు, నర్సాపురం పట్టణాలు, కృష్ణాలోని విజయవాడ నగరం, పెనమలూరు గ్రామీణం, జగ్గయ్యపేట పట్టణం, నూజివీడు, మచిలీపట్నం, గుంటూరు జిల్లాలోని గుంటూరు నగరం, నరసారావుపేట, మాచర్ల, అచ్చంపేట, మంగళగిరి, పొన్నూరు, చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి మండలాలు, కర్నూలులోని కర్నూలు నగరం, నంద్యాల, బనగానపల్లి, పాణ్యం, ఆత్మకూరు, నందికొట్కూరు, కోడుమూరు, శిరువెళ్ల, గూడూరు, చాగలమర్రి బేతంచెర్ల, గడివేముల, ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ,ఎమ్మిగన్నూరు, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరం, చీరాల, కారంచేడు, కందుకూరు, గుడ్లూరు, కనిగిరి, కొరిసపాడు, మార్కాపురం, పొదిలి, నెల్లూరులోని నెల్లూరు నగరం, నాయుడుపేట, వాకాడు, తడ, అల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, గూడురు, కావలి, కోవూరు, ఓజిలి, తోటపల్లి గూడురు, చిత్తూరులోని శ్రీకాళహస్తి, తిరుపతి నగరం, పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు, కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, కడప నగరం, నగరి, పులివెందుల, మైదుకూరు, వేంపల్లె, ఎర్రగుండ్ల, అనంతపురం జిల్లాలోని హిందూపురం , అనంతపురం నగరం, కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు మండలాలను ప్రభుత్వం రెడ్‌జోన్‌ మండలాలుగా గుర్తించి, వాటిలో కఠిన నిబంధనలను అమలుచేయబోతోంది. రాష్ట్రంలో విజయవాడ నగరంలో కరోనా కేసుల తీవ్రత అత్యధికంగా ఉండటంతో వర్తక, వాణిజ్య రాజధానిగా ఉన్న బెజవాడలో రేపటి నుంచి ఆరు రోజుల పాటు గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ను మూసివేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు వీటిని బంద్‌ చేయనున్నారు. ఈ మార్కెట్‌ నుంచి రాష్ట్రంతోపాటు, ఇతర రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున సరుకులు ఎగుమతి, దిగుమతులు జరుగుతుంటాయి.

tags : redzones

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info