A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
Share |
August 11 2020, 12:12 pm

గ్రామ, వార్డు సచివాలయాల్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15, 16 తేదీల్లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

గ్రామ, వార్డు సచివాలయాల్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది.

ఈ నెల 15, 16 తేదీల్లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రయోగాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా కాజ సచివాలయం ఎంపికైంది.

ఇక్కడ పరిశీలన అనంతరం రాష్ట్రంలోని మిగిలిన చోట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. గత కొద్ది రోజులుగా సచివాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఎవరు చేయాలనే అంశంపై ఇటు రిజిస్ట్రేషన్‌, అటు ప్రభుత్వవర్గాల్లో అయోమయం నెలకొంది.

తాజాగా దీనిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ప్రయోగాత్మక కార్యక్రమం కావడంతో సబ్‌రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలోనే సచివాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

దస్తావేజుకు సంబంధించిన చెక్‌స్లిప్‌లు కొట్టడానికి, మార్కెట్‌ ధరలు పక్కాగా నమోదు చేశారా? లేదా? అనేవి పరిశీలించే పనులకు మాత్రం సచివాలయాల్లోని ఇతర సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు అవసరమైన నెట్‌వర్కింగ్‌ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది.

tags : ap, registrations

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info